- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TS Election: పోలింగ్ కేంద్రం వద్ద డబ్బుల పంపిణీ
by GSrikanth |
తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడా ఈవీఎం మిషన్లు మొరాయించినా.. మెజార్టీ స్థానాల్లో చురుగ్గా సాగుతోంది.

X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. అక్కడక్కడా ఈవీఎం మిషన్లు మొరాయించినా.. మెజార్టీ స్థానాల్లో చురుగ్గా సాగుతోంది. ఇదిలా ఉండగా.. పోలింగ్ వేళ వికారాబాద్ జిల్లాలో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. జిల్లాలోని తాండూర్ మండలం కరన్కట్లోని కోటవీధి పోలింగ్ కేంద్రం వద్ద నగదు పంపిణీ కలకలం రేపింది. నగదు పంపిణీ జరగుతున్న విషయం పోలీసులకు తెలియడంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల రాకను గమనించిన యువకులు డబ్బులను అక్కడే వదిలేసి పారిపోయారు. పట్టుబడిన నగదు రూ.7.45 లక్షలు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు.
Next Story






