7వ తారీఖు నుంచి అక్కడే పడుకుంటా.. బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు (Video)

by Disha Web Desk 2 |
7వ తారీఖు నుంచి అక్కడే పడుకుంటా.. బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు (Video)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సారి ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్ సునామీలో అన్ని పార్టీలు కొట్టుకుపోవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో పార్టీ అద్భుతంగా పుంజుకున్నదని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఇటీవల బండ్ల గణేష్ గాంధీ భవన్‌కు వచ్చారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధితో మాట్లాడారు. డిసెంబర్ 9వ తేదీన రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి మీరు కూడా వస్తారా? అని మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. దీనికి బండ్ల గణేష్ స్పందిస్తూ.. ‘నేను 7వ తేదీ నుంచి అక్కడే పడుకుంటా. మీరంతా 9వ తేదీన రండి’ అని సెటైరికల్‌గా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


Next Story