ఎమ్మెల్యే రసమయి ప్రచారంలో అనూహ్య పరిణామం (వీడియో)

by Disha Web Desk 2 |
ఎమ్మెల్యే రసమయి ప్రచారంలో అనూహ్య పరిణామం (వీడియో)
X

దిశ, శంకరపట్నం: ఎన్నికల ప్రచారంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. మానకొండూరు నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్ తరపున ప్రచారం నిర్వహిస్తున్న యువతి సొమ్మసిల్లి పడిపోయింది. వివరాల్లోకి వెళితే.. మంగళవారం శంకరపట్నం మండలం కొత్తగట్టు గ్రామంలో ఎమ్మెల్యే రసమయి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ క్రమంలో అంబాల అక్షయ అనే యువతి ఉన్నట్టుండి సొమ్మసిల్లి పడిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే గ్రామంలోని ఆర్‌ఎంపీ వైద్యుడు రమేశ్‌కు చూపించగా.. ప్రథమ చికిత్సను అందించాడు. ప్రస్తుతం యువతి ఆరోగ్యం నిలకడగా ఉంది.

Next Story

Most Viewed