- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తుక్కుగూడ సభలో వీహెచ్ హాట్ కామెంట్స్
by GSrikanth |
కేసీఆర్ ఒక్కడే పోరాటితే తెలంగాణ రాలేదని.. ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై విద్యార్థులు ఉద్యమం ప్రారంభిస్తే చంద్రబాబు పదవి ఇవ్వకపోతే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఫైర్ అయ్యారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ ఒక్కడే పోరాటితే తెలంగాణ రాలేదని.. ఈ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయంపై విద్యార్థులు ఉద్యమం ప్రారంభిస్తే చంద్రబాబు పదవి ఇవ్వకపోతే కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఎత్తుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఫైర్ అయ్యారు. ఇవాళ స్వరాష్ట్రాన్ని మేము తెచ్చామని బీఆర్ఎస్ చెబుతోందని ఒక్క ఎంపీతో తెలంగాణ ఏర్పాటు సాధ్యమా అని ప్రశ్నించారు. సోనియా గాంధీ చెప్పిన ప్రకారం తెలంగాణ ఇచ్చిందని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ రెండు ఒక్కటే అని ఈ రెండు పార్టీల డ్రామాలను ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. రాబోయే రోజుల్లో ముస్లింల రిజర్వేషన్లు ఎత్తివేస్తామని కర్నాటకలో అమిత్ షా అంటే కేసీఆర్ ఒక్కసారి కూడా ఖండించలేదని మండిపడ్డారు. సెప్టెంబర్ 17తో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని తెలంగాణ సాయుధ పోరాటంలో బీజేపీ నేతలు ఉన్నారా అని ప్రశ్నించారు.
Next Story






