గిరిజన యూనివర్సిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం

by Disha Web Desk 2 |
గిరిజన యూనివర్సిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని పాలమూరు సభలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రధాని ప్రకటించిన రెండ్రోజులకే గిరిజన వర్సిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ఈ బిల్లుపై నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి ఆమోదం తెలిపింది. ములుగు జిల్లాలో రూ. 900 కోట్లతో కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ వర్సిటీకి గిరిజనుల ఆరాధ్యదైవమైన సమ్మక్క, సారక్క పేర్లను పెట్టారు. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ బీజేపీకి హైప్ తెచ్చేలా ప్రధాని మోడీ కీలక హామీలు ఇచ్చారు. ట్రైబల్ వర్సిటీతో పాటు పసుపు బోర్డు కూడా ఏర్పాటు చేయబోతన్నట్లు ప్రకటించారు. మరి ఇవి ఎన్నికల్లో ఎంతమేరకు పనిచేస్తాయో చూడాలి.

Next Story

Most Viewed