- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మహిళా కమిషన్ చైర్‌పర్సన్ ఖాళీ.. సునీతా లక్ష్మారెడ్డి రాజీనామా
రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున రాజ్యాంగపరమైన పదవి నుంచి తప్పుకున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. నర్సాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నందున రాజ్యాంగపరమైన పదవి నుంచి తప్పుకున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేతుల మీదుగా ప్రగతి భవన్‌లో బుధవారం బీ-ఫారం అందుకున్న కొన్ని గంటల తర్వాత ఆమె ఆ పదవికి రాజీనామా చేశారు. రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీచేశారు.
రెండున్నరేళ్ళకు పైగా ఆమె కమిషన్ చైర్‌పర్సన్‌గా వ్యవహరించారు. దీర్ఘకాలం పాటు కమిషన్ ఖాళీగా ఉండడంతో హైకోర్టు ఆదేశాల మేరకు 2020 డిసెంబరు 27న కమిషన్ ఏర్పాటైంది. చైర్‌పర్సన్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు ఆ బాధ్యతల నుంచి ఆమె తప్పుకున్నారు. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాతే కొత్త చైర్‌పర్సన్ నియమితులు కానున్నారు.






