ఖమ్మం రోడ్ షోలో రేవంత్ పాటకు ప్రియాంక డ్యాన్స్ (వీడియో)

by Disha Web Desk 2 |
ఖమ్మం రోడ్ షోలో రేవంత్ పాటకు ప్రియాంక డ్యాన్స్ (వీడియో)
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలీంగ్‌ తేదీ దగ్గర పడుతుండడంతో పార్టీలు ప్రచారం వేగవంతం చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీల అగ్రనేతలు తెలంగాణకు క్యూ కట్టారు. వారు సభలు, రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఖమ్మంలో రోడ్ షో పాల్గొన్నారు. ఈ ర్యాలీ భారీ జన సందోహం మధ్య సాగింది. అయితే రోడ్ షోకి వచ్చిన కార్యకర్తలకు మరింత ఉత్సాహం నింపేందుకు ప్రియాంక గాంధీ ప్రచార రథంపై డ్యాన్స్ చేసి అలరించారు. అందులోనూ రేవంత్ రెడ్డి పాటకు బంజార మహిళలతో కలిసి ప్రచారం రథంపై స్టెప్స్ వేశారు. దీంతో కార్యకర్తలు పెద్ద ఎత్తున విజిల్స్ వేస్తూ సంతోషం వ్యక్తం చేశారు.

Next Story

Most Viewed