- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభుత్వం రాగానే రూ.400కే గ్యాస్ సిలిండర్
by GSrikanth |
బీజేపీ వాళ్లు పేదల కోసం ఒక్క మంచి పని అయినా చేశారా? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో పర్యటించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ వాళ్లు పేదల కోసం ఒక్క మంచి పని అయినా చేశారా? అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రూ. 400 లకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని హామీ ఇచ్చారు. రైతు బీమా లాగా కోటి కుటుంబాలకు రూ.5 లక్షల బీమా అందించబోతున్నామని తెలిపారు. ఓడ దాటే దాకా ఓడ మల్లన్న, ఓడ దాటాక బోడి మల్లన్న అన్నట్లుంది కాంగ్రెస్ పరిస్థితి అని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో నమ్మితే మోసపోతామని అన్నారు. బీఆర్ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కేసీఆర్ గెలిస్తే అందరం బాగు పడతాం.. లేదంటే అందరం బాధ పడతాం.. అని పిలుపునిచ్చారు.
Next Story






