- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాంగ్రెస్‌కు సీఎం కావాలి.. మాకు సీట్లు కావాలి
పొత్తుల అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పొత్తులపై కాంగ్రెస్ పెద్దన్న పాత్ర వహించాలని అన్నారు. జాతీయ స్థాయిలో సీపీఐ ఇండియా కూటమిలోనే ఉంది.

దిశ, డైనమిక్ బ్యూరో: పొత్తుల అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో పొత్తులపై కాంగ్రెస్ పెద్దన్న పాత్ర వహించాలని అన్నారు. జాతీయ స్థాయిలో సీపీఐ ఇండియా కూటమిలోనే ఉంది. తెలంగాణలోనూ పొత్తులు, సర్దుబాట్లు ఉండాలని అభిప్రాయపడ్డారు. శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన నారాయణ కాంగ్రెస్‌తో సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేయాలన్నది మా ఉద్దేశం అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కావాలి.. మాకు సీట్లు కావాలని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ఎన్నికల కోసమే మహిళా బిల్లు తీసుకొచ్చారని బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే 2024 ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. డీలిమిటేషన్‌తో మహిళా బిల్లు ముడిపెట్టడం రాజకీయంలో భాగమే అని డీలిమిటేషన్ పేరుతో ఉత్తర దక్షిణ ప్రాంతాల మధ్య బీజేపీ గొడవ పెట్టే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వమే కొనసాగితే దేశం ఉత్తర, దక్షిణ భాగాలుగా విడిపోవడం ఖాయం అన్నారు.






