మాలాగా బీఆర్ఎస్ గ్యారంటీలు ఇవ్వగలదా?: భట్టి

by Disha Web Desk 2 |
మాలాగా బీఆర్ఎస్ గ్యారంటీలు ఇవ్వగలదా?: భట్టి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాలాగా బీఆర్ఎస్ గ్యారంటీలు ఇవ్వగలదా అని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ప్రశ్నించారు. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజా సంపదను దోచుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ సునామీలా బీఆర్ఎస్‌ను ముంచెత్తునుందని, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గ్యారంటీల్లో భాగంగా మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు. గ్యాస్ సిలిండర్ ఐదువందలు, పెన్షన్, మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా లాంటి హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Next Story

Most Viewed