ఎన్టీఆర్ శత జయంతిపై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే

by Disha Web Desk 14 |
ఎన్టీఆర్ శత జయంతిపై వైఎస్ షర్మిల రియాక్షన్ ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: ఇవాళ స్కర్గీయ నందమూరి తారక రామారావు 100వ జయంతి. ఈ సందర్భంగా వైఎస్సార్టీపీ చీఫ్ వైఎస్ షర్మిల స్పందించారు. తెలుగు ప్రజలకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపును తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. పేదలకు కావాల్సిన మౌళిక వసతులు కల్పించేందుకు సీఎంగా, ఓ పార్టీ అధినేతగా ఎన్టీఆర్ ఎనలేని కృషి చేశారని పొగిడారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. బతికి ఉన్నంత కాలం ఉన్నత విలువలతో కూడిన రాజకీయాలు చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. అలాంటి గొప్ప వ్యక్తి శత జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు షర్మిల అన్నారు.

Also Read..

కేసీఆర్ ముఖ్యమంత్రి కాదు.. తాలిబన్లకు అధ్యక్షుడు: YS షర్మిల సంచలన వ్యాఖ్యలు

Next Story

Most Viewed