వైఆర్‌పీ పౌండేషన్ ఆధ్వర్యంలో 40మంది విద్యార్థులకు స్కాలర్ షిప్

by Ajay Maddhiboyina |

వైపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 మంది ప్రతిభావంతులైన విద్యార్ధులకు తొమ్మది లక్షల రూపాయల స్కాలర్ షిప్‌లను బుధవారం అందజేశారు.

వైఆర్‌పీ పౌండేషన్ ఆధ్వర్యంలో 40మంది విద్యార్థులకు స్కాలర్ షిప్
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో 40 మంది ప్రతిభావంతులైన విద్యార్ధులకు తొమ్మది లక్షల రూపాయల స్కాలర్ షిప్‌లను బుధవారం అందజేశారు. మాదాపూర్ లోని వైష్టవి గ్రూప్ కార్పొరెట్ ఆఫీస్ లో రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఛైర్మన్ డా. జస్టీస్ షమీమ్ ఆక్తర్ రిటైర్డ్ ఐఏఎస్ ఎం జగదీశ్వర్ చేతుల మీదుగా స్కాలర్ షిప్‌ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఎంబీబీఎస్ , ఇంజనీరింగ్ , హై స్కూల్ , ప్రాథమిక విద్య అభ్యనిస్తూ ఆర్ధికంగా వెనుకబడిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అందజేస్తున్నట్లు వైఆర్‌పీ ఫౌండేషన్ ఛైర్మన్ ఎలిశాల రవిప్రసాద్ తెలిపారు. ఫౌండేషన్ ద్వారా 350 మంది విద్యార్థులకు చేయూత నిచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో శరత్ చంద్ర , హేమచంద్ర, ఎడ్ల కృష్ణారెడ్డి, యమ దయాకర్ , చకీలం శేషగిరిరావు పాల్గొన్నారు.

Next Story