తీన్మార్ మల్లన్నపై హెచ్ఆర్సీకి యూట్యూబర్స్ ఫిర్యాదు

by Ramesh Naini |

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC)కి శుక్రవారం పలువురు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు ఫిర్యాదు చేశారు.

తీన్మార్ మల్లన్నపై హెచ్ఆర్సీకి యూట్యూబర్స్ ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC)కి శుక్రవారం పలువురు యూట్యూబ్ ఛానళ్ల నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. మల్లన్న ఆఫీస్ ముందు ఆత్మహత్య చేసుకున్న సాయి ఈశ్వరాచారి మరణంపై సమగ్ర విచారణ జరపాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈశ్వరాచారి మరణాన్ని బీసీ ఉద్యమానికి లింక్ పెట్టాలని చూస్తున్న మల్లన్నను విచారించాలని వినతిలో పేర్కొన్నారు. మల్లన్న ఆఫీసు లోపలి సీసీ ఫుటేజ్‌ను బయటపెట్టాలని యూట్యూబర్స్ డిమాండ్ చేశారు. ఈశ్వరాచారి మరణంపై కథనాలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానల్స్ పై మల్లన్న తప్పుడు ఫిర్యాదులు చేయిస్తున్నారని యూట్యూబర్స్ ఈ సందర్భంగా మండిపడ్డారు. కాగా, బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ అమలులో అన్యాయం జరిగిందని సాయి ఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఈ దుర్ఘటనకు కారకులైన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని బీసీ, దళిత, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వీడియో ..

Next Story