- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యువత డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి.. మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు
జీవితాలను ఛిద్రం చేసే మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: జీవితాలను ఛిద్రం చేసే మాదక ద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఇవాళ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవ ర్యాలీని నిర్వహించారు. కలెక్టర్ చౌరస్తా, వినాయక్ చౌక్, గాంధీ చౌక్ మీదుగా నిర్వహించిన ఈ ర్యాలీని మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మనిషి జీవితం చాలా విలువైందని, చెడు అలవాట్లకు బానిసలై జీవితాన్ని నాశనం చేసుకోవద్దని యువతకు పిలునిచ్చారు. ఉత్కృష్టమైన మానవ జీవితాన్ని సార్థకత చేసుకోవాలని అన్నారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని పేర్కొన్నారు.
ముఖ్యంగా సమాజంలో మాదకద్రవ్యాల బారిన పడి యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌తో చాలా కుటుంబాలు నడిరోడ్డున పడిన సందర్బాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. డ్రగ్స్, గంజాయికి సంబంధించిన ఎలాంటి సమాచారం ఉన్నా జిల్లా ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. విద్యార్థులు, యువత, పోలీస్ అధికారులు, సిబ్బంది డ్రగ్స్ వ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కలిసికట్టుగా ముందుకు రావాలని కోరారు. మారిన జీవన విధానం వల్ల మానసిక, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, వాటిని అధిగమించేందుకు ప్రతి రోజూ ఒక గంట తమది కాదనుకుని వ్యాయామం, యోగ, ధ్యానం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, వెడ్మ బొజ్జు, కలెక్టర్ రాజర్షీ షా, ఎస్పీ అఖిల్ మహాజన్, తదితరులు పాల్గొన్నారు.






