- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mahesh Kumar Goud: సర్పంచ్ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ పోటీపై టీపీసీసీ చీఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
జంపింగ్ పాలిటిక్స్ లాంగ్ టర్మ్ లో సక్సెస్ ఇవ్వదని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులు అధిక సంఖ్యలో పోటీ చేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. యూత్ నాయకులు గ్రౌండ్‍లో పని చేస్తేనే గుర్తింపు ఉంటుంది గ్రామాలలో పనిచేస్తే ప్రజల నాడీ తెలుస్తుందని అందువల్ల సర్పంచ్ ఎన్నికలతో (Sarpanch Elections) పాటు ఆ తర్వాత రాబోయే ఎంపీపీ, జడ్పీటీసీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నేతలు పోటీలో ఉండాలన్నారు. ఇవాళ గాంధీ భవన్‍లో రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు శివచరణ్ రెడ్డి అధ్యక్షతన యువజన కాంగ్రెస్ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా మహేష్ కుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఎస్‍యూఐ (NSUI), యూత్ కాంగ్రెస్‍లో పని చేసిన వారికి పార్టీలో మంచి భవిష్యత్ ఉంటుందని ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నత స్థాయిలో ఉన్న అనేక మంది నాయకులు గతంలో ఎన్ఎస్‍యూఐలో పని చేసినవారేనన్నారు. యూత్ కాంగ్రెస్‍లో పని చేసిన నాయకులకు కార్పోరేషన్ చైర్మన్‍లు, డీసీసీ అధ్యక్షులు అయ్యారని ఇలాంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం అవుతుందన్నారు.
జంపింగ్ పాలిటిక్స్ వర్కౌట్ కాదు:
మీరంతా పార్టీకి భవిష్యత్ అని పార్టీలో మీలాంటి యువత ఉంటేనే ఒక నాణ్యమైన నాయకత్వం వస్తుందన్నారు. జంప్ పాలిటిక్స్ చేస్తే కొంత కాలం బాగుంటుందని లాంగ్ పాలిటిక్స్ లో అది సక్సెస్ ను ఇవ్వదన్నారు. రాహుల్ గాంధీ ఎస్ఎస్‍యూఐ, యూత్ కాంగ్రెస్‍లు అంటే చాలా ఇష్టపడుతారని మీరు భవిష్యత్‍లో మరింత మంచి అవకాశాలు సాధించాలని ఆకాంక్షించారు. కష్టపడితే మంచి భవిష్యత్ ఉంటుందని యూత్ కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. మీకు మంచి భవిష్యత్ ఉందని రాబోయే రోజుల్లో మీకు ఇంకా మంచి పదవులు వస్తాయని చెప్పారు.






