రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. మెంటల్ ఆస్పత్రికి తరలింపు

by Yella Dhawani Reddy |

రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ వద్ద పట్టాలపై కారు నడుపుతూ ఓ యువతి హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే.

రైల్వే ట్రాక్‌పై కారు నడిపిన యువతి.. మెంటల్ ఆస్పత్రికి తరలింపు
X

దిశ, వెబ్ డెస్క్: రెండు రోజుల క్రితం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం కొండకల్ వద్ద పట్టాలపై కారు నడుపుతూ ఓ యువతి హల్‌చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన ఒక్కసారిగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కారు నడిపిన యువతిని వోమిక సోనీగా అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఆమెను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా, వారిపై దాడి చేసింది. దీంతో అధికారులు ఆమె మానసిక స్థితిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ చేవెళ్లలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆమె మానసికంగా సరిగ్గా లేనట్లు తేలటంతో హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రికి తరలించారు. కాగా

కొండకల్ నుంచి చిన్న శంకర్‌పల్లి వరకు సుమారు 7 కిలోమీటర్లు రైల్వే ట్రాక్‌పై ఆమె కారు నడిపింది. దీంతో గంట 20 నిమిషాల పాటు రైళ్లను నిలిపివేశారు. 8 ప్యాసింజర్‌, గూడ్స్ రైళ్లను అధికారులు నిలిపివేశారు. ఆమెపై రైల్వే సెక్షన్లు 147 ట్రేస్ పాస్, 153 రైళ్ల రాకపోకలకు అంతరాయం కింద కేసులు నమోదు చేశారు. చికిత్స తర్వాత విచారణకు హాజరుకావాలని పోలీసులు తెలిపారు. కాగా, వోమిక సోనీ గత కొన్నిరోజులగా తల్లిదండ్రులు, భర్తకు దూరంగా ఉంటున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం ఉద్యోగం పొగొట్టుకున్న సోని డ్రిపెషన్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. లక్నోకి చెందిన సోనీ స్థానికంగా పుప్పాల గూడలో నివాసం ఉంటుంది.

Next Story