- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యువ అధికారికి నగ్న వీడియోలు పంపుతూ యువతి బ్లాక్‌మెయిల్
మార్ఫింగ్ చేసిన ఫొటోలను అధికారికి వాట్సాప్ చేస్తూ పెళ్లి చేసుకోకుంటే బజారుకీడుస్తా అంటూ కిలేడీ హల్ చల్ చేస్తోంది.

దిశ, భీమదేవరపల్లి : తన నగ్న వీడియోలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలను అధికారికి వాట్సాప్ చేస్తూ పెళ్లి చేసుకోకుంటే బజారుకీడుస్తా అంటూ రచ్చ చేస్తున్న కిలేడీ క్రైం కథ ఇది. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పనిచేస్తున్న ఓ అధికారికి అదే మండలంలోని కొప్పూరు గ్రామానికి చెందిన ఓ యువతి రెండేళ్లుగా వెంటపడి వేధిస్తోంది. ఆమె వేధింపులపై గతంలో ముల్కనూరు పోలీసులు కౌన్సెలింగ్ చేయడంతో అధికారికి వేధింపులు ఆగిపోయాయి.
అయితే గత వారం రోజుల క్రితం నుంచి నెంబర్లు మార్చుతూ, కొత్త నెంబర్ల నుంచి న్యూడ్ కాల్స్, మార్ఫింగ్ ఫొటోలు పంపుతూ బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. సదరు యువతి వేధింపులకు ఓ అధికారి ఉద్యోగానికి తరుచు సెలవులు పెట్టుకుంటున్న పరిస్థితి నెలకొంది. తరచూ కార్యాలయానికి వచ్చి మనోవేదనకు గురిచేస్తుందని సదరు అధికారి సన్నిహితుల వద్ద తన గోడు వెళ్లబోసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా సదరు యువతి గతంలోనూ హుజురాబాద్ పట్టణానికి చెందిన ఓ యువకుడిని ఇలానే ఇబ్బందులకు గురి చేసినట్లుగా తెలుస్తోంది.






