యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ విద్యార్థుల ఘనత

by Naga Rani Yarlagadda |

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (వైఐఎస్ యూ) అద్భుతమైన విజయంతో సరికొత్త రికార్డు సృష్టించింది.

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ విద్యార్థుల ఘనత
X
  • మైక్రోసాఫ్ట్‌లో 11 మందికి భారీ ఆఫర్లు
  • 14 మంది విద్యార్థుల్లో 11 మంది మైక్రోసాఫ్ట్ కు ఎంపిక
  • రూ. 7 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (వైఐఎస్ యూ) అద్భుతమైన విజయంతో సరికొత్త రికార్డు సృష్టించింది. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో భాగంగా అంతర్జాతీయ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్లో ఈ యూనివర్సిటీ విద్యార్థులు భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు సాధించారు. యూనివర్సిటీలో డేటా సైన్స్ మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తి చేసిన మొత్తం 14 మంది విద్యార్థుల్లో, ఏకంగా 11 మంది విద్యార్థులు మైక్రోసాఫ్ట్ సంస్థకు ఎంపికయ్యారు. వీరంతా ఏడాదికి రూ. 7 లక్షల ప్రారంభ ప్యాకేజీతో ఉద్యోగాలు పొందడం విశేషం.

విజయవంతమైన తొలి బ్యాచ్

పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించడమే లక్ష్యంగా ప్రారంభమైన ఈ యూనివర్సిటీ, మొదటి బ్యాచ్‌లోనే ఈ స్థాయి విజయాన్ని అందుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. డేటా సైన్స్ రంగానికి ఉన్న విపరీతమైన డిమాండ్‌ను అందిపుచ్చుకుంటూ విద్యార్థులు ఈ ఘనత సాధించారు. మొత్తం 14 మంది కోర్సు పూర్తి చేయగా, అందులో 11 మంది ప్రపంచ స్థాయి ఐటీ సంస్థ అయిన మైక్రోసాఫ్ట్‌లో ప్లేస్‌మెంట్ సాధించడం యూనివర్సిటీ బోధనా ప్రమాణాలకు నిదర్శనమని విద్యాశాఖ అధికారులు, వర్సిటీ యాజమాన్యం కొనియాడారు. ఉద్యోగాలు సాధించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ విద్యార్థులను, వారికి శిక్షణ ఇచ్చిన అధ్యాపక బృందాన్ని పలువురు ప్రముఖులు అభినందించారు.

Next Story