Bhatti Vikramarka: ఈ ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోవాలి.. భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్

by Prasad Jukanti |

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్ చేశారు.

Bhatti Vikramarka: ఈ ప్రభుత్వాన్ని మీరే కాపాడుకోవాలి.. భట్టి విక్రమార్క హాట్ కామెంట్స్
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిత్యం ప్రజల కోసమే ఈ ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. మాపై చేసే అనవసర విమర్శలను కుట్రలుగానే చూస్తామని హాట్ కామెంట్స్ చేశారు. సంపద సృష్టించి దానిని పెదలకు పంచుతామని ఇదే మా నినాదం అని చెప్పారు. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ప్రతి పైసా ప్రజలకే ఖర్చు చేస్తోందన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో ఇందిర సౌర గిరి జల వికాసం పథకం (Indira Soura Giri Jala Vikasam scheme)ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రూ.వెయ్యి కోట్లతో రాజీవ్ యువ వికాసం ప్రారంభిస్తున్నాం. జూన్ 2న రాజీవ్ యువ వికాసం పథకం అర్హులకు పత్రాలు ఇవ్వబోతున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలను తీసుకువస్తామని చెప్పారు. మన కోసం పని చేసే ప్రభుత్వాన్ని గుండెల్లో పెట్టుకుని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరో 20 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వమే పరిపాలించాలన్నారు.

సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు ఇది:

నల్లమల డిక్లరేషన్ ద్వారా గిరిజిన కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని భట్టి విక్రమార్క అన్నారు. దేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు ఇది అన్నారు. భూమి కోసం ఈ గడ్డపై అనేక పోరాటాలు జరిగాయని గిరిజన బిడ్డల సంక్షేమం కోసం తెచ్చిన గొప్ప పథకం ఈ ఇందిర సౌర గిరి జల వికాసం అన్నారు. అటవీ సంపద ఫలాలు పూర్తిగా గిరిజనులకే దక్కాలని చెప్పారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో కనీసం ప్రభుత్వ పాఠశాలల గురించి ఆలోచించారా అని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాలు చదివే స్కూళ్ల గురించి బీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు.

Next Story