Gali Janardhan Reddy : మీరు యావజ్జీవ శిక్షకు అర్హులు : గాలి జనార్ధన రెడ్డిపై కోర్ట్ ఫైర్

by Muthe.Rajitha |

ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసు (Obulapuram Illegal Mining Case)లో నేడు సీబీఐ కోర్టు తుది తీర్పు(Final Judgement) వెలువడిన విషయం తెలిసిందే.

Gali Janardhan Reddy : మీరు యావజ్జీవ శిక్షకు అర్హులు : గాలి జనార్ధన రెడ్డిపై కోర్ట్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసు (Obulapuram Illegal Mining Case)లో నేడు సీబీఐ కోర్టు తుది తీర్పు(Final Judgement) వెలువడిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల సుధీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో ఐదుగురిని దోషులుగా.. ఇద్దరిని నిర్దోషులుగా కోర్ట్ ప్రకటించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ, గాలి జనార్ధన్ రెడ్డి(Gali Janardhan Reddy), బీవీ శ్రీనివాస్, వీడీ రాజగోపాల్, అలీఖాన్‌లను దోషులుగా నిర్ధారిస్తూ.. వీరికి ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, రిటైర్డ్ IAS కృపానందంను నిర్దోషులుగా తేల్చింది. కాగా తుది తీర్పుకు ముందు ఈ కేసులో ప్రధాన నిందితుడు గాలి జనార్ధన రెడ్డి సీబీఐ కోర్టుకు ఒక ముఖ్య వినతి చేశాడు.

ఇప్పటికే 4 ఏళ్లు జైల్లో ఉన్న కారణంగా తనకు మరింత శిక్ష తగ్గించాలని కోర్టును కోరాడు. ఈ వినతిపై కోర్ట్ సీరియస్ అయింది. మీ నేరానికి మీరు యావజ్జీవ శిక్షకు అర్హులు అని మండి పడింది. అసలు మీకు 10 ఏళ్ల శిక్ష ఎందుకు వేయకూడదో చెప్పమని ప్రశ్నించింది. తాను ప్రజాసేవలో ఉన్నానని, ప్రజలకు అందుబాటులో ఉండాలి కాబట్టి శిక్ష తగ్గించాలని వేడుకున్నారు. అయినప్పటికీ చట్ట ప్రకారం ఏడేళ్ళ జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధించింది కోర్ట్.

Next Story