YS Avinash Reddy: ఆ వీడియోలు, ఆడియోలు ఇవ్వండి..!

by Disha Web Desk 16 |
YS Avinash Reddy: ఆ వీడియోలు, ఆడియోలు ఇవ్వండి..!
X

దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత మాజీ మంత్రి వైఎస్ వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో వైఎస్ వివేకా హత్య కేసు విచారణకు సంబంధించిన వివరాలు ఇచ్చేలా సీబీఐని ఆదేశించాలని మధ్యంతర దరఖాస్తు చేస్తూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మార్చి 14న సీబీఐ జరిపిన విచారణకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డ్‌ను ఇప్పించాలని హైకోర్టును కోరారు. ఈ మేరకు సీబీఐని ఆదేశించాలని హైకోర్టును కోరారు. ఇకపోతే వివేకా హత్య కేసులో ఇటీవల అవినాశ్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.

కాగా వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డితో పాటు ఆయన తండ్రి బాస్కర్ రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీంతో సీబీఐ అధికారులు ఇప్పటికే పలుమార్లు వీరిని విచారించారు. ఎంపీ అవినాశ్ రెడ్డికి సీఆర్పీసీ నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో సీబీఐ అధికారుల విచారణను ఆపలేమని కోర్టు స్పష్టం చేసింది. అవినాశ్ రెడ్డి పిటిషన్‌ను తోసిపుచ్చింది. అయితే అవినాశ్ రెడ్డిపై తీవ్ర చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. అయితే తాజాగా మరోసారి కూడా అవినాశ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించడం చర్చనీయాంశంగా మారింది.

Also Read..

ప్రభుత్వ భూమిలో BRS MP పాగా.. భూ దోపిడీలను సీరియల్‌గా ప్రకటిస్తా: రేవంత్ రెడ్డి

Next Story

Most Viewed