- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
MLC Kavitha : బీఆర్ఎస్ హయాంలోనే యాదగిరిగుట్ట అభివృద్ధి : ఎమ్మెల్సీ కవిత
బీఆర్ఎస్(BRS) హయాంలో కేసీఆర్ పాలనలోనే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం(Yadagirigutta Temple)అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)వ్యాఖ్యానించారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించే గిరి ప్రదక్షిణలో కవిత, స్థానిక మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితతో కలిసి పాల్గొన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్(BRS) హయాంలో కేసీఆర్ పాలనలోనే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం(Yadagirigutta Temple)అభివృద్ధి చెందిందని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)వ్యాఖ్యానించారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి జన్మనక్షత్రం స్వాతి నక్షత్రం సందర్భంగా నిర్వహించే గిరి ప్రదక్షిణలో కవిత, స్థానిక మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునితతో కలిసి పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగించి క్షేత్ర వైభవం మరింత పెంచాలన్నారు. కాంగ్రెస్ పాలనతో ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసులకు శాపంగా మారిన ఫ్లోరైడ్ ను కేసీఆర్ మిషన్ భగీరథతో పారద్రోలడం జరిగిందన్నారు. పార్లమెంటులో కేంద్రం సైతం ఈ విషయాన్ని దృవీకరించిందన్నారు. మూసీ నది కాలుష్యానికి రాష్ట్రాన్ని 60ఏండ్లు పాలించిన కాంగ్రెస్ కారణమన్నారు.
కేసీఆర్ మదిలోని ఆలోచనయైన మూసీ ప్రక్షాళన, పునరుజ్జీవానికి మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో మూడు ట్రీట్ మెంట్ ప్లాంట్లు పెట్టామని, వాటికి కాంగ్రెస్ నాయకులు ప్రారంభించి జబ్బలు జరుచుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మూసీ ప్రక్షాళన చేస్తామని నది పరివాహకంలోని పేదల ఇండ్లను ప్రక్షాళన చేస్తున్నారని కవిత విమర్శించారు. కేసీఆర్ 25వేల కోట్లతో పునరుజ్జీవన ప్యాకేజీ ప్లాన్ చేశారన్నారు. కాళేశ్వరం కొండపోచమ్మ నుంచి 1700కోట్లతో మూసీకి లింకేజీ చేయాలని కేసీఆర్ తలపెట్టగా కాంగ్రెస్ పాలకులు దాన్ని పక్కన పెట్టి 7,500కోట్లతో మల్లన్న సాగర్ నుంచి మూసీకి లింక్ ను తెరపైకి తెచ్చారని, ఇంత ప్రజాధనం దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేయాలన్నారు.
మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏటీఎంగా మార్చి ఆ పేరుతో వచ్చే నిధులను ఢిల్లీకి పంపించనుందని కవిత కీలక ఆరోపణలు చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో నల్లగొండ జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పై చేసిన విమర్శలకు ఖచ్చితంగా బుద్ధి చెబుతున్నామన్నారు. నల్లగొండలో కాంగ్రెస్ నాయకులు గుండాల మాదిరిగా బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై, కార్యాలయాలపై దాడి చేయడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. మాది 60లక్షల పార్టీ సభ్యుల కుటుంబమని, మేం తలుచుకుంటే తెలంగాణలో మీరు ఒక్క అడుగుకూడా ముందుకు వేయలేరని.. మళ్లీ బీఆర్ఎస్ ఆఫీసులపైన దాడి చేస్తే ఖబడ్ధార్ అని హెచ్చరించారు.
ఉమ్మడి నల్లగొండ అభివృద్ధికి ప్రజల వద్ధకే పాలన తేవాలని చెప్పి మూడు జిల్లాలను ఏర్పరిచి మూడు మెడికల్ కాలేజీలు ఏర్నాటు చేశామని, మీరు 60ఏండ్ల పాలనలో ఎందుకు ఏర్పాటు చేయలేదని కవిత కాంగ్రెస్ పాలకులను ప్రశ్నించారు. కొత్త కలెక్టర్ ల ప్రారంభోత్సవానికి హాజరైన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆనాడు కేసీఆర్ ను పొగిడారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లాలోని 12అసెంబ్లీ నియోజకవర్గాల్లో 36వేల కోట్లను అభివృద్ధి కోసం, 42వేల కోట్లను సంక్షేమ పథకాల కోసం ఖర్చు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు, ఇందిరమ్శ అత్మీయ భరోసాలకు గతంలో తీసుకున్న దరఖాస్తులు ఉండగానే మళ్లీ గ్రామసభల పేరుతో దరఖాస్తులు అడుగుతున్నారన్నారు.
50లక్షల జాబ్ కార్డులు, కోటీ మంది కూలీలుఉండగా అందులో 10లక్షల మందికి కూడా ఇందిరమ్మ ఆత్మీయ పథకం ఇచ్చేది కనిపించడం లేదన్నారు. సంక్రాంతికి ఇస్తామన్న రైతుభరోసా, సన్నబియ్యం, రేషన్ కార్డులు ఇవ్వలేదన్నారు. 26వ తేదీతో పథకాల అమలు జరగకపోతే కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయాలన్నారు. కేసీఆర్ కొనసాగించిన ఎస్ఎల్బీసీ, బస్వాపూర్, గంథమల్ల, డిండి ప్రాజెక్టులను కాంగ్రెస్ పూర్తి చేయాలన్నారు. నాగార్జున సాగర్ ఆయాకట్టుకు బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నీరందిస్తే కాంగ్రెస్ పాలనలో సాగర్ నిర్వాహణ కేంద్రం చేతుల్లోకి వెళ్లి నీటి విడుదల అందకుండా పోయిందన్నారు.
కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలన్న కక్షతో కాళేశ్వరం పరిధిలో 3లక్షల 30వేలు, సాగర్ పరిధిలో లక్ష 20వేల ఎకరాలను కాంగ్రెస్ పాలకులు ఎండబెట్టారన్నారు. ఈ దఫానైనా రైతులకు నీరందించేందుకు ఉత్తమ్ చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణా ట్రిబ్యూనల్ కాంగ్రెస్ సరైన వాదనలు వినిపించడం లేదని, అందకోసం ప్రభుత్వంపై ప్రజలు ఒత్తిడి పెంచాలన్నారు. కేసీర్ పింఛన్ తప్ప ఇవ్వాలిటికి కూడా కాంగ్రెస్ పెంచుతామన్న పింఛన్ ఇవ్వడం లేదని, పథకాల్లో ఎట్లా కోతలు పెట్టాలన్న ఆలోచన తప్పా కాంగ్రెస్ కు హామీలను అమలు చేసే చిత్తశుద్ధి లేదన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలపై ప్రజలు ఆ పార్టీ నాయకులను నిలదీయాలన్నారు. రాజకీయంగా కాంగ్రెస్ బీజేపీలు రెండు ఒక్కటేనని..కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనార్టీ మంత్రి, లంబాడీ మంత్రి లేదని కవిత విమర్శించారు.






