చరిత్ర సృష్టించిన యాదగిరిగుట్ట దేవస్థానం.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర పోస్ట్

by Ramesh Naini |

ఎనర్జీ ఆడిట్ నిర్వహించిన ఆలయంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం చరిత్ర సృష్టించింది.

చరిత్ర సృష్టించిన యాదగిరిగుట్ట దేవస్థానం.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర పోస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలోనే తొలిసారిగా ఎనర్జీ ఆడిట్ నిర్వహించిన ఆలయంగా (Yadagirigutta) యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం (Lakshmi Narasimha Swamy Temple) చరిత్ర సృష్టించింది. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Komatireddy Venkat Reddy) వివరాలను పంచుకున్నారు. స్వామివారి అన్నప్రసాదాల నాణ్యత, భక్తులకు కల్పిస్తున్న ఆధునిక సౌకర్యాలు, సంతృప్తికరమైన దర్శన ఏర్పాట్లు, శుభ్రత, పర్యావరణ పరిరక్షణ, పారదర్శక పరిపాలన వంటి అంశాలలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించడమే కాకుండా, సమగ్ర నిర్వహణలోనూ ఈ ఆలయం ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. ఈ కృషికి గుర్తింపుగా ఆలయానికి మూడు ఐఎస్ఓ సర్టిఫికెట్లు (ISO 9001, ISO 22000 మొదలైనవి), గుడ్ గవర్నెన్స్ సర్టిఫికేషన్లు లభించడం గర్వకారణమని పేర్కొన్నారు. ఇలాంటి విశిష్టతను సాధించినందుకు ఆలయ అధికారులు, సిబ్బంది అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఆలయ ప్రధాన అర్చకులు, ప్రతినిధులు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులను సచివాలయంలో కలిసిన ఫోటోలను మంత్రి కోమటిరెడ్డి షేర్ చేశారు.

Next Story