Yadagirigutta : యాదగిరిగుట్టలో భక్తజనులతో కిటకిట

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2024-11-03 04:53:27  IST  )

ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్తుల రద్దీతో కిటకిటలాడింది.

Yadagirigutta : యాదగిరిగుట్టలో భక్తజనులతో కిటకిట
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ పుణ్య క్షేత్రం యాదగిరిగుట్ట(Yadagirigutta) శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. కార్తీక మాసం(Kartika month), అందులో ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు వేలాదిగా కార్తీక దీపారాధన పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతాల నిర్వహణకు, స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. సత్యనారాయణ వ్రత మండపం భక్తుల రద్దీతో కిక్కిరిసింది. వ్రతాల అనంతరం ప్రధానాలయంలో లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

భక్తుల రద్దీతో యాదగిరి గుట్ట కొండ పరిసరాలు కిటకిటలాడాయి. భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు ఈవో భాస్కర్ రావు దేవస్థానం సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని సమన్వయం చేస్తు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Next Story