యాదాద్రి ఆలయ ఈఈ రామారావు సస్పెండ్

by Gantepaka Srikanth |

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఎలక్ట్రికల్ ఈఈ రామారావును సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు ఆదివారం వెల్లడించారు.

యాదాద్రి ఆలయ ఈఈ రామారావు సస్పెండ్
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఎలక్ట్రికల్ ఈఈ రామారావును సస్పెండ్ చేసినట్లు ఆలయ ఈవో భాస్కరరావు ఆదివారం వెల్లడించారు. యాదగిరిగుట్ట దేవస్థానంలో ఎలక్ట్రికల్‌ విభాగంలో రామారావు ఈఈగా పని చేస్తున్నారు. ‌రామరావుపై గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి. రామారావు యాదాద్రి ఆలయంలో కొన్ని సంవత్సరాలుగా ఏఈ, డీఈ, ఈఈగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన డిపార్ట్మెంట్లో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో ఆలయ ఈవో, చైర్మన్‌కు తెలియకుండా కొంతమందిని నియమించుకున్నారు. ఈ విషయం బయటకు రావడంతో ఆలయ ఈవో దీనిపై విచారణ చేపట్టారు. ఈ విచారణలో నిజమని తేలడంతో సస్పెండ్ చేసినట్లు ఈవో భాస్కరరావు వెల్లడించారు.

Next Story