- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వామ్మో.. బర్త్ డే కేక్‍లో పురుగులు.. హైదరాబాద్‍లో ఫ్యామిలికి చేదు అనుభవం
బర్త్ డే కేక్ లో పురుగులు రావడం కలకలం రేపింది. హైదరాబాద్ నగరంలో ఈ ఘటన పట్ల నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజల ఆరోగ్యం ఎటుపోయినా మాకక్కర్లేదు.. మాకు కావాల్సిన డబ్బులు వస్తున్నాయా లేదా అన్నట్లు తయారైంది కొంతమంది వ్యాపారుల పరిస్థితి. తాజాగా హైదరాబాద్ నగరంలో (Hyderabad) షాకింగ్ ఘటన వెలుగు చూసింది. బర్త్ డే కేక్‍లో పురుగులు రావడం కలకలం రేపింది. బర్త్‍డే పార్టీ కోసం ఓ కుటుంబం హైటెక్ సిటీలోని బింజ్ ఎన్ బాష్ (Binge n Bash) అనే ప్రైవేట్ థియేటర్ ను బుక్ చేసుకుంది. గ్రాండ్‍గా సెలబ్రేషన్ చేసుకునేలా ప్లాన్ చేసిన ఆ కుటుంబం అంతే ఉత్సాహంతో థియేటర్‍లోకి ప్రవేశించింది. వేడుకల్లో భాగంగా కేక్ ఆర్డర్ చేయగా సిబ్బంది కేక్ తీసుకువచ్చి ముందు పెట్టారు. ఆ కేక్‍లో పురుగులు (Worms in Cake) కనిపించడంతో ఒక్కసారిగా కంగుతిన్న ఆ కుటుంబం వెంటనే ఇదేంటని సిబ్బందిని నిలదీసింది. ఎంతో సంతోషంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకుందామని వస్తే పురుగులు పట్టిన కేక్ ఇవ్వడం ఏంటని మండిపడ్డారు. ఈ ఘటనపై అధికారులు, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సదరు కుటుంబం డిమాండ్ చేసింది.
హైదరాబాద్ అంటే విషతుల్యమేనా?:
ఇటీవల హైదరాబాద్ నగరంలో కల్తీ రాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఆహారపదార్థాలతో పాటు చిన్నపిల్లలు తినే చాక్లెట్ల వరకు అన్నింటిని కల్తీ చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. అధికారుల తనిఖీల్లో నిత్యం ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్నా కేవలం కేసుల వరకే పరిమితం కావడంతో ఇలాంటి కేటుగాళ్లు ఎలాంటి భయం లేకుండా యదేచ్ఛగా కల్తీ చేస్తున్నారనే విమర్శలు హైదరాబాద్ నగర ప్రజల నుంచి వినిపిస్తోంది. ఓ వైపు కల్తీ రాయుళ్ల ఆటలు ఇలా ఉంటే మరో వైపు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులు, బెకరీలలో పురుగుల వ్యవహారం నెటిజన్లను మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నాయి. హైదరాబాద్ అంటే ఇక విషతుల్యమేనా? ఓ వైపు కల్తీ మరోవైపు పురుగులు పట్టిన ఆహార పదార్థాలతో బతుకులుసాగించాల్సిందేనా అని మండిపడుతున్నారు. నాణ్యతను గాలికి వదిలి కాసుల కోసం కక్కుర్తి పడుతున్న ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.






