నిమ్స్ లో వరల్డ్ మూవ్‌మెంట్ డిజార్డర్స్ డే

by Muthe.Rajitha |

ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) శస్త్రచికిత్సలు జరుగుతున్న దేశంలోని ఏకైక సంస్థ నిమ్స్ అని... గత రెండు సంవత్సరాల్లో సుమారు 140 డీబీఎస్ ప్రొసీజర్లు విజయవంతంగా పూర్తయ్యాయని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప తెలిపారు.

నిమ్స్ లో వరల్డ్ మూవ్‌మెంట్ డిజార్డర్స్ డే
X

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ఆరోగ్య పథకం కింద డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) శస్త్రచికిత్సలు జరుగుతున్న దేశంలోని ఏకైక సంస్థ నిమ్స్ అని... గత రెండు సంవత్సరాల్లో సుమారు 140 డీబీఎస్ ప్రొసీజర్లు విజయవంతంగా పూర్తయ్యాయని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీరప్ప తెలిపారు. వరల్డ్ మూవ్‌మెంట్ డిజార్డర్స్ డే సందర్భంగా బుధవారం నిమ్స్ లోని న్యూరాలజీ, న్యూరోసర్జరీ విభాగాలు సంయుక్తంగా నిర్వహించిన పేషెంట్ అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మూవ్‌మెంట్ డిజార్డర్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచడం, సామాజిక అపహాస్యం(సోషల్ స్టిగ్మా) తగ్గించడం, రోగులు ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారం, మెరుగైన చికిత్స కోసం పరిశోధనను ప్రోత్సహించడం, రోగుల కోసం సపోర్ట్ గ్రూపులపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యమని బీరప్ప వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో డా. నిరజ్ కుమార్, డా. సిరీష యరీడ, డా. వంసీ కృష్ణ వై, డా. వసుందరా రంగన్, డా. నవీన్ కుమార్ ప్రసంగించి... మూవ్‌మెంట్ డిజార్డర్స్ ఉన్న రోగులు, వారి సంరక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా రోగులు నిపుణ వైద్యులతో నేరుగా మాట్లాడి, తమ సమస్యలపై స్పష్టత పొందారు. ఇలాంటి కార్యక్రమాలు రోగులలో ఆత్మవిశ్వాసం పెంచడంలో, సమాజంలో అవగాహన పెంపొందించడంలో, మరియు జీవిత నాణ్యతను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయని డైరెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో డా. రేష్మ, డా. రింద, డా. సబీహా, మీడియా రిలేషన్ ఆఫీసర్ సత్యగౌడ్, మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Next Story