- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కొత్త ఎండీకి సమస్యల స్వాగతం.. క్యూ కట్టిన ఆర్టీసీ కార్మిక సంఘాలు
ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ ఉన్నప్పుడు కార్మిక సంఘాలను కనీసం బస్ భవన్

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ ఎండీగా వీసీ సజ్జనార్ ఉన్నప్పుడు కార్మిక సంఘాలను కనీసం బస్ భవన్ వైపునకు కూడా రానిచ్చే పరిస్థితి ఉండేది కాదని... కానీ ఇప్పుడు కొత్తగా ఎండీగా వచ్చిన ఐపీఎస్ అధికారి నాగిరెడ్డి తమ సమస్యలను వినేందుకు అవకాశం కల్పిస్తున్నారని కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. నాగిరెడ్డి ఎండీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంఘాల నాయకులు బస్ భవన్‌కు క్యూ కడుతున్నారు. తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో అత్యంత కీలకంగా ఉన్న తమను గత ప్రభుత్వం తీవ్రంగా వేధించిందని... కాంగ్రెస్ సర్కారుపై తమకు నమ్మకం ఉందని చెబుతున్నారు. అందులో భాగంగా కొత్తగా ఎండీగా వచ్చిన నాగిరెడ్డికి స్వాగతం పలుకుతూ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. బుధవారం ఆర్టీసీ ప్రధాన కార్మిక సంఘాలైన తెలంగాణ మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు ఎండీని కలిసి కార్మికులు ఎదుర్కుంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపోయారు.
ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ ఇచ్చినందుకు థ్యాంక్స్...
సంస్థలో సిబ్బంది కొరత ఉన్నందువలన 1753 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చి నియామకాలు చేస్తున్నందుకు కార్మిక సంఘాల నాయకులు ఎండీకి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా సుమారు 17 వేల పోస్టులు ఖాళీ ఉన్నందున వాటికి కూడా కొత్త ఎండీ సారథ్యంలో నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు. ఇంత పెద్ద సంస్థలో ట్రేడ్ యూనియన్లను అనుమతించకపోవటం వల్ల కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందువలన ట్రేడ్ యూనియన్లను అనుమతించేలా చూడాలని కోరారు. కార్మికులకు 2021, 2025 కు సంబంధించి 2 వేతన సవరణలు బకాయిలు ఉన్నాయని, వాటిని అమలు జరిపి కార్మికులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.






