గ్రామాల అభివృద్ధికి నిస్వార్థంగా కృషి చేయండి.. కొత్త పాలకవర్గాలకు కవిత స్పెషల్ విషెస్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-22 05:54:50  IST  )

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే.

గ్రామాల అభివృద్ధికి నిస్వార్థంగా కృషి చేయండి.. కొత్త పాలకవర్గాలకు కవిత స్పెషల్ విషెస్
X

దిశ, వెబ్‌‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ముగిసిన విషయం తెలిసిందే. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యులు ఇవాళ్టి ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇందుకోసం పంచాయతీ రాజ్ శాఖ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది. దీంతో ప్రత్యేక అధికారుల నుంచి కొత్త సర్పంచ్‌ల చేతుల్లోకి గ్రామ పాలన పగ్గాలు వెళ్లనున్నాయి.

ఈ నేపథ్యంలోనే తెలంగాణ జాగృతి చీఫ్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘X’ (ట్విట్టర్) వేదికగా గ్రామాల్లో ఎన్నికైన కొత్త పాలకవర్గాలకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించి నేడు బాధ్యతలు స్వీకరిస్తున్న సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు అని అన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు.. పల్లెల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం అనే నినాదాన్ని అనుసరిస్తూ.. గ్రామాల అభివృద్ధి కోసం మీరందరూ నిస్వార్ధంగా కృషి చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా.. అని కవిత ట్వీట్ చేశారు.

Next Story