- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha : 8న మహిళా శంఖారావం : ఎమ్మెల్సీ కవిత
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తూ మార్చి 8వ తేదీ(March 8th) అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇందిరా పార్కు వద్ధ మహిళా శంఖారావం(Women's Shankharavam) ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత( BRS MLC Kavitha) ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఎన్నికల్లో మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు డిమాండ్ చేస్తూ మార్చి 8వ తేదీ(March 8th) అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ఇందిరా పార్కు వద్ధ మహిళా శంఖారావం(Women's Shankharavam) ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత( BRS MLC Kavitha) ప్రకటించారు. జాగృతి సమావేశంలో కవిత మహిళా శంఖారావం పోస్టర్ ను కవిత ఆవిష్కరించి మాట్లాడారు.
మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు నిర్వహిస్తున్న మహిళా శంఖారావంకు రాష్ట్రం నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ఆడబిడ్డలు ఒకసారి తమ భవిష్యత్తుపై సింహావలోకనం చేసుకోవాని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చారని, అలాగే మహిళలకు పలు సంక్షేమ, అభివృద్ధి పథకాలను అమలు చేశారన్నారు. ఇవ్వాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఆడబిడ్డల అభివృద్ధి సంగతేమోగాని భద్రత కూడా కరువైందని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పెట్టిన సీసీ కెమెరాల్లో 70శాతం పనిచేయడం లేదన్నారు. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు 18ఏళ్లు నిండిన ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తామని చెప్పి ఇవ్వడం లేదన్నారు.
కేసీఆర్ కిట్, గర్భిణీల కోసం అంబులెన్స్ పథకాలు అమలు కావడం లేదని..పేద గర్భిణీలకు నెలకు వేయి రూపాయాలు అందించడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అదికూడా ఇవ్వడం లేదని, మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి కాంగ్రెస్ పాలనలో నమ్మకం పోయిందని..ప్రభుత్వం వాటిపై శ్రద్ధ పెట్టాలని డిమాండ్ చేశారు. సోనియాగాంధీ, రాహుల్, ప్రియాంకా గాంధీలను తీసుకొచ్చి ఆరు గ్యారంటీల హామీలు ఇప్పించారని, మహిళలకు నెలకు రూ.2,500ఇస్తామని చెప్పి ఇప్పటిదాకా 35వేలు ఒక్కొక్కరికి బాకీ పడ్డారన్నారు. వరంగల్ లో రైతు డిక్లరేషన్ చేసి అమలు చేయనందుకు ప్రజలు ప్రశ్నిస్తారని తెలిసి భయంతో పారిపోయి రాహుల్ గాంధీ వరంగల్ పర్యటన రద్ధు చేసుకున్నారని..ఇదే పద్ధతిలో హామీలు అమలు చేయని కాంగ్రెస్ పాలకులను నిలదీస్తారన్నారు.
ఎన్నికల హామీల అమలుపై బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. మహిళలకు రూ.500లకు సిలిండర్, 200యూనిట్లు అందరికి అమలు కావడం లేదన్నారు. ఈ రోజు 33జిల్లాల నుంచి మహిళా ప్రతినిధులు వచ్చారని.. మార్చి 8న అసలు సినిమా ఉందన్నారు. రేషన్ కార్డుల దరఖాస్తులు, జారీ నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని, ఉచిత బస్సుతో మహిళలకు అత్మగౌరవం దెబ్బతీస్తున్నారని, బస్సుల సంఖ్య పెంచి వారి గౌరవం కాపాడాలన్నారు. ఆర్టీసీ కార్మికులకు సక్రమంగా జీతాలివ్వాలని, బీడీ కార్మికులకు 4వేల హామీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు ఇచ్చిన హామీలపై ఎవరు అడగడం లేదన్న ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. బూటకపు హామీలతో మహిళలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై మహిళా శంఖారావంతో జాగృతి పోరాటం ప్రారంభించిందని..ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి మహిళలకు ఇచ్చిన హామీలపై సమీక్ష చేసి అమలుకు చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.






