- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
NRIs: నైటా ఆధ్వర్యంలో అమెరికాలో ఘనంగా శివరాత్రి, మహిళా దినోత్సవ వేడుకలు
అమెరికా ప్రధాన నగరంలో న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అమెరికా ప్రధాన నగరంలో న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (నైటా) ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని, మహిళా దినోత్సవం రెండు వేడుకలను కలిపి నైటా సంబరాలను ఆదివారం అద్వితీయంగా నిర్వహించారు. ప్రత్యేక నైటా సంబరాల సావనీర్-2026 ను ప్రముఖ ఎన్ఆర్ఐ వ్యాపారవేత్త, వితరణశీలి డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. న్యూయార్క్, న్యూజెర్సీ తో పాటు పరిసర ప్రాంతాల్లో ఉన్న తెలుగు వారందరూ పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మ్యూజికల్ కన్సర్ట్ అందరినీ అలరించింది. భక్త కన్నప్ప స్కిట్, టీ అండ్ టీ సిస్టర్స్ నృత్య ప్రదర్శన, ఘర్షణ బ్యాండ్, అంజనా సౌమ్య, సృష్టి చిల్లాల ఫర్మార్మెన్స్‌లు ఆకట్టుకున్నాయి. చిన్నారులు ప్రదర్శించిన కళారూపాలు, వివిధ స్కిట్‌లు ఆకట్టుకున్నాయి.
శుభాకాంక్షలు తెలిపిన సీఎం, డిప్యూటీ సీఎం
సంస్కృతి సంప్రదాయాల కలబోతగా న్యూయార్క్ వేదికగా నైటా నిర్వహిస్తున్న కార్యక్రమాలను ప్రశంసిస్తూ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు, న్యూయార్క్ కాన్సులేట్ జనరల్ ప్రత్యేక సందేశాలు పంపారు. అమెరికాలో స్థిరపడిన కూడా పుట్టిన ప్రాంతం పండుగలు, సంప్రదాయాలను గౌరవిస్తూ కొనసాగిస్తున్నామని, వేడుకల విజయాన్ని ఆకాంక్షిస్తూ సహకరించిన అందరికీ ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నైటా వైస్ ప్రెసిడెంట్ హరిచరణ బొబ్బిలి, సెక్రటరీ మహేశ్ బాబు, ట్రెజరర్ డాక్టర్ సౌమ్య శ్రీ, ఇతర కార్యవర్గ సభ్యులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, అడ్వయిజరీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.






