- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘జూబ్లీహిల్స్ ఎన్నికలు బీఆర్ఎస్‌కు ఫైనల్ పరీక్షలు’
‘జూబ్లీహిల్స్ ఎన్నికలు బీఆర్ఎస్‌కు ఫైనల్ పరీక్షలు’

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(Jubilee Hills By-Election)పై మహిళా కార్పొరేషన్ చైర్మన్ శోభారాణి(Shobharani) కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేవి బీఆర్ఎస్‌కు ఫైనల్ పరీక్షలు లాంటివి అని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పరిస్థితి రోజు రోజుకి దిగజారి పోతోందని విమర్శించారు. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్‌లో బీఆర్ఎస్‌కు చావు దెబ్బ తగిలింది. మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) చనిపోయిన బాధలో సునీత ఉంటే వారిని ఎన్నికల బరిలోకి దించి సానుభూతిగా బీఆర్ఎస్ వాడుకుంటోంది. పీజేఆర్(PJR) చనిపోయాక ఆయన కుటుంబ సభ్యులు గతంలో కేసీఆర్(KCR) అపాయింట్మెంట్ కోసం గంటలు తరబడి ఎదురుచూపులు చేశారు. ఆయన విషయం వారి కుటుంబ సభ్యులు కొంతమంది మర్చిపోయారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన చూసిన జనం.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి.. పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారని శోభారాణి విమర్శించారు.
బీఆర్ఎస్‌లో ఎవరికీ మహిళలకు గౌరవం ఇచ్చే సంప్రదాయం లేదు. గత పదేళ్లలో మహిళలకు ఏనాడూ పదవులు ఇవ్వలేదు.. ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు. సొంత ఇంటి మహిళ కవితనే ఇంటి నుంచి గెంటివేశారు. అక్కడే తెలిసిపోతుంది.. బీఆర్ఎస్‌లో మహిళల పరిస్థితి ఎలా ఉందో అని వెల్లడించారు. రాజకీయాలు కోసమే బీఆర్ఎస్ డ్రామాలు చేస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా పదేళ్ల పాటు బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదని విమర్శించారు.
అనంతరం ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత మాట్లాడుతూ.. రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గం వైపు చూస్తోంది. కాంగ్రెస్ పార్టీ బీసీ బిడ్డకు అవకాశం ఇచ్చింది. 22 కేసులు, పీడీ యాక్ట్ ఉన్న సల్మాన్ ఖాన్‌ను బీఆర్ఎస్ పార్టీలోకి ఎలా తీసుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి ఎక్కడ ఉంది. నాలుగు ముక్కలాటగా బీఆర్ఎస్ మిగిలిపోయింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలా దోచుకున్నారో కవిత పూసగొచ్చినట్లుగా వివరించింది. బీఆర్ఎస్ పార్టీ వల్ల మాగంటి సునీత పరువు పోయింది. రాజకీయాలతో మాగంటి సునీతకు సంబంధం లేదు. బలవంతంగా జూబ్లీహిల్స్ అభ్యర్థిగా బరిలోకి దించారు.






