శ్రీ చైతన్య విద్యా సంస్థలపై మహిళా కమిషన్ సీరియస్.. ఎందుకంటే?

by Ramesh Naini |

శ్రీ చైతన్య విద్యా సంస్థలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది.

శ్రీ చైతన్య విద్యా సంస్థలపై మహిళా కమిషన్ సీరియస్.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీ చైతన్య విద్యా సంస్థలపై తెలంగాణ మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఈ మేరకు ఇవాళ శ్రీ చైతన్య కళాశాలల చైర్మన్ కి మహిళా కమిషన్ సమన్లు జారీ చేసింది. బాచుపల్లి శ్రీచైతన్య కాలేజ్‌లో ఫస్ట్ ఇయర్ చదువుతున్న వర్షిణి ఆత్మహత్యపై మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. డిసెంబర్ 10 న వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ల శారద సమన్లు జారీ చేశారు. కాగా, బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్‌కు చెందిన విద్యార్థిని, శ్రీ చైతన్య ఇంటర్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న వర్షిత (16) హాస్టల్ గదిలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హాస్టల్ నిర్వాహకులు ఈ ఘటనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దాంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోని ఘటనపై కేసు నమోదు చేశారు. త‌మ కూతురు చావుకు కార‌ణ‌మైన‌ శ్రీచైత‌న్య క‌ళాశాల యాజ‌మాన్యం పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మృతురాలి త‌ల్లిదండ్రులు డిమాండ్ చేశారు.

Next Story