పోస్టాఫీసులకు భారీగా క్యూ కడుతున్న మహిళలు.. కారణం ఇదే

by Muthe.Rajitha |

వరంగల్(Warangal) నగరంలో పోస్టాఫీసు(Post Office)లకు మహిళలు భారీగా క్యూ కడుతున్నారు.

పోస్టాఫీసులకు భారీగా క్యూ కడుతున్న మహిళలు.. కారణం ఇదే
X

దిశ, వెబ్ డెస్క్ : వరంగల్(Warangal) నగరంలో పోస్టాఫీసు(Post Office)లకు మహిళలు భారీగా క్యూ కడుతున్నారు. కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 'మహాలక్ష్మి పథకం'(Mahalaxmi Scheme)లో భాగంగా ప్రతి మహిళకు నెలకు రూ. 2500 ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఐ పథకాన్ని త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించనుందని, ఆ అమౌంట్ పోస్టాఫీసు ఖాతాల్లో మాత్రమే జమ చేయనుందని భారీగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో గత వారం రోజుల నుంచి హనుమకొండ జిల్లా హెడ్ పోస్టాఫీసులో అకౌంట్ తెరిచేందుకు భారీ సంఖ్యలో మహిళలు వస్తున్నారు.

బాలింతలు, వృద్ధులు సైతం గంటల తరబడి లైన్లో నిలబడి మరీ ఖాతాలు తెరుస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని పోస్టాఫీసు అధికారులు తెలిపారు. కాగా అకౌంట్లు తీసుకునేందుకు వచ్చిన వారికి మాత్రం కొత్త అకౌంట్స్ ఇస్తున్నామని వెల్లడించారు.

Next Story