- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మీరు అందించిన సాయం చూస్తుంటే గుండె బరువెక్కుతోంది’.. KTR ఎమోషనల్
బీఆర్ఎస్(BRS) రజతోత్సవ సభ కోసం లగచర్ల మహిళలు(Lagacharla Womens) విరాళం ప్రకటించారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) రజతోత్సవ సభ కోసం లగచర్ల మహిళలు(Lagacharla Womens) విరాళం ప్రకటించారు. మంగళవారం ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)ను కలిసి రూ.లక్ష అందించారు. విరాళం చూసి గుండెనిండా సంతోషంగా అనిపించిందని కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉన్న బీఆర్‌ఎస్‌కు.. ఉడతాభక్తిగా లగచర్ల గిరిజన మహిళలు సహాయం చేశారని అన్నారు. లగచర్ల గిరిజనులను పోలీసుల చేత ప్రభుత్వం ఎంతో హింసించిందని అన్నారు. ఆ ఘటనను ఎవరు మర్చిపోయినా.. బీఆర్ఎస్ మర్చిపోదని.. అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు, బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం నేపథ్యంలో ఈనెల 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలకేంద్రంలో నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ సభకు సర్వం సిద్ధం చేస్తోంది. సభ నిర్వహణకు మరో ఐదు రోజుల సమయం మాత్రమే ఉండడంతో ఏర్పాట్లలో ఆ పార్టీ అధినాయకత్వం బిజీబిజీగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ కావడంతో ఇటు పార్టీ శ్రేణులతో పాటు అటు ప్రజానీకంలోనూ ఆసక్తి నెలకొంది.
ఈ సభను బీఆర్ఎస్ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. స్వయంగా పార్టీ అధినేత కేసీఆరే సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండటం గమనార్హం. సభా స్థలి ఎంపిక, వాహనాల కూర్పు, జన సమీకరణ విధానం ఇలా అన్నింటిపై కేసీఆర్ ఆలోచనలు ఇమిడి ఉన్నట్లుగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సభకు లక్షలాదిగా జనాలను తరలించాలనే లక్ష్యంతో ఆ పార్టీ నాయకత్వం పావులు కదుపుతోంది.






