Mann Ki Baat: తెలంగాణలోని ఆ ప్రాంత మహిళలను అభినందించిన ప్రధాని

by Gantepaka Srikanth |

‘మన్ కీ బాత్’(Mann Ki Baat) ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఆదిలాబాద్‌లోని ఆదివాసీ మహిళలు తయారు చేసే మహువా కుకీస్(ఇప్పపువ్వు లడ్డూ) గురించి ప్రస్తావించారు.

Mann Ki Baat: తెలంగాణలోని ఆ ప్రాంత మహిళలను అభినందించిన ప్రధాని
X

దిశ, వెబ్‌డెస్క్: ‘మన్ కీ బాత్’(Mann Ki Baat) ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఆదిలాబాద్‌లోని ఆదివాసీ మహిళలు తయారు చేసే మహువా కుకీస్(ఇప్పపువ్వు లడ్డూ) గురించి ప్రస్తావించారు. ‘ఆదివాసీ మహిళలు(Womens) తయారు చేసే మహువా కుకీస్‌(Mahua Cookies)కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఇద్దరు సోదరీమణులు మహువా పువ్వులతో కొత్త ప్రయోగం చేశారు. వారు వీటితో వివిధ రకాల వంటకాలు చేస్తారు. వీటిని ప్రజలు చాలా ఇష్టపడతారు. వారి వంటలలో ఆదివాసీ సంస్కృతి(Tribal Culture) మాధుర్యం కూడా ఉంది’ అని ‘మన్ కీ బాత్’లో ప్రధాన మంత్రి చెప్పారు. అంతేకాదు.. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని అరకు కాఫీని ప్రధాని మరోసారి ప్రశంసించారు.

"అరకు కాఫీ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది, ఇది ఆంధ్రప్రదేశ్ రైతుల కష్టానికి నిదర్శనం" అని ఆయన అన్నారు. కాగా, ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తెలంగాణ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర నేతలు వీక్షించారు. కార్యాలయంలో స్క్రీన్‌ ఏర్పాటు చేసి ప్రధాని చెప్పిన సందేశాలను విన్నారు. కాగా, మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్ 3వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.




Next Story