ఆర్టీసీ బస్సులో లొల్లి.. పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. ఎక్కడంటే?

by Ramesh Naini |

మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే.

ఆర్టీసీ బస్సులో లొల్లి.. పొట్టు పొట్టు కొట్టుకున్న మహిళలు.. ఎక్కడంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: (TGSRTC) మహాలక్ష్మీ పథకంలో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిత్యం బస్సుల్లో సీటు కోసం, ఇతర కారణాలతో ఘర్షణలకు దారి తీస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఆర్టీసీ బస్సులో సీటు కోసం జుట్టు పట్టుకొని ఇద్దరు మహిళలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మణుగూరు నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. మహిళలు గొడవ పడుతున్న సమయంలో తోటి ప్రయాణికులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఈ క్రమంలోనే వారిని కంట్రోల్‌లోకి తెచ్చారు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్లనే ఈ గొడవలకు కారణమని నెటిజన్లు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ గోవడను ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌కు ఎక్స్ వేదికగా ట్యాగ్ చేస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story