- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆగస్ట్ 24న విచారణకు రండి : కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు
ఈ నెల 24న విచారణకు హాజరవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు పంపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : ఈ నెల 24న విచారణకు హాజరవ్వాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మహిళా కమిషన్ నోటీసులు పంపింది. మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ మహిళా కమిషన్ కేటీఆర్ వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుంది. మహిళలు బస్సుల్లో కుట్లు అల్లికలే కాదు, బ్రేక్ డ్యాన్సులు కూడా చేసుకోండి అనడం మహిళలను కించపరచడమే అని అభిప్రాయ పడిన కమిషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద, విచారణకు హాజరవ్వమని ఆదేశాలు జారీ చేసింది. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తం కాగా, స్పందించిన కేటీఆర్ క్షమాపణలు కోరారు. మహిళలు తనకు అక్కా చెల్లెళ్ల వంటి వారని, వారిని అగౌరవ పరచడం తన ఉద్దేశం కాదని వివరణ ఇచ్చారు.
Next Story






