మహిళలను ఓట్లడిగితే చెప్పుతో కొడతారు : బల్మూరి వెంకట్

by Sathputhe Rajesh |   (  Updated:2023-01-27 03:05:34  IST  )

గవర్నర్‌పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బల్మూరి వెంకట్ ఫైర్ అయ్యారు.

మహిళలను ఓట్లడిగితే చెప్పుతో కొడతారు : బల్మూరి వెంకట్
X

దిశ, జమ్మికుంట: గవర్నర్ పై ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కాంగ్రెస్ హుజురాబాద్ ఇన్ ఛార్జ్ బలమూరు వెంకట్ ఫైర్ అయ్యారు. స్థాయిని మరచి ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మహిళ అయిన గవర్నర్‌పై విమర్శలు చేస్తున్నారన్నారు. మహిళలకు గౌరవం ఇవ్వకుండా మాట్లాడే నువ్వు మహిళల దగ్గరికి వెళ్లి ఎలా ఓట్లు అడుగుతావని ప్రశ్నించారు. ఓట్లు అడిగితే మహిళలు చెప్పుతో కొట్టే పరిస్థితి వస్తుందన్నారు. శాసన మండలి సభ్యునిగా ఉండి ఒక గవర్నర్‌ని ఎలా గౌరవించాలి.. ఎలా మాట్లాడాలి తెలియని నువ్వు రేపు శాసనసభ మండలి‌లో ప్రజల కోసం ఏం మాట్లాడుతావన్నారు.

మహిళా గవర్నర్‌ను అవమానించిన నువ్వు బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే రానున్న రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. నిన్ను కన్న తల్లి కూడా ఒక మహిళ అని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

Also Read...

ఆ కమ్యూనిటీ ఓటర్లపై ప్రధాన పార్టీల ఫోకస్.. ఆకర్షించేలా వ్యూహాలు!

Next Story