Raj Bhavan: గవర్నర్‌ను కలవాలంటూ రాజ్‌భవన్ ముందు బైఠాయించిన మహిళ.. ఎందుకంటే?

by Ramesh Naini |

గవర్నర్‌ను కలిసేందుకు అనుమతివ్వాలని రాజ్‌భవన్ ఎదుట ఓ మహిళ బైఠాయించింది.

Raj Bhavan: గవర్నర్‌ను కలవాలంటూ రాజ్‌భవన్ ముందు బైఠాయించిన మహిళ.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: గవర్నర్‌ను కలిసేందుకు అనుమతివ్వాలని రాజ్‌భవన్ (Raj Bhavan) ఎదుట ఓ మహిళ బైఠాయించింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇవాళ (శుక్రవారం) (Telangana Governor) తెలంగాణ గవర్నర్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని ఓ మహిళ రాజ్‌భవన్ ఎదుట బైఠాయించారు. ముంబయిలోని తన ఇంట్లో సుమారు రూ.24 లక్షలు చోరీకి గురైనట్లు తెలిపారు. అయితే.. ఈ చోరీ వ్యవహారంపై ఇక్కడి బొల్లారం పీఎస్‌లో తాను ఫిర్యాదు చేస్తే.. పోలీసులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గవర్నర్ అపాయింట్‌మెంట్ ఇవ్వకుంటే రాజ్ భవన్ ముందే ఆత్మహత్య చేసుకుంటా అంటూ మహిళ బెదిరింపులకు దిగారు. దీంతో రాజ్‌భవన్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు.

Next Story