- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫోన్లో వీడియోలు తీసి అధికారి వేధింపులు.. చెంప వాయించిన మహిళ (వీడియో)
ఫోన్ లో ఫోటోలు, వీడియోలు తీసి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వేధిస్తున్న ఓ అధికారి చెంప వాయింది ఓ మహిళ.

దిశ, డైనమిక్ బ్యూరో:ఫోన్ లో ఫోటోలు, వీడియోలు తీసి అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు వేధిస్తున్న ఓ అధికారి చెంప వాయింది ఓ మహిళ. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ పట్టణంలో నివాసం ఉంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ ఓ మహిళను వేధించడం ప్రారంభించాడు. ఫోన్లో వీడియోలు, పోటోలు తీస్తూ వేధిస్తున్నాడు. దీంతో అతడి ప్రవర్తనతో విసుగు చెందిన సదరు మహిళ అతడి చెంపవాయించింది. అలాగే బాధితురాలు ఈ విషయాన్ని తన భర్తకు చెప్పడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
అసభ్య ప్రవర్తనతో వేధిస్తున్నాడని.. అధికారి చెంప చెల్లుమనిపించిన మహిళ
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2024
నారాయణఖేడ్ పట్టణంలో నివాసం ఉంటున్న ఎలక్షన్ డిప్యూటీ తహశీల్దార్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ మహిళ చెంప చెల్లుమనిపించింది.
ఫోన్లో వీడియోలు, ఫొటోలు తీస్తూ వేధిస్తున్నాడని వాపోయింది. బాధితురాలు తన భర్తకు… pic.twitter.com/edXuPnRbWq






