గవర్నర్‌ను కలువాలంటూ రాజ్ భవన్ ముందు బైఠాయించిన మహిళా..

by Bhanu |

గవర్నర్‌ను కలువాలంటూ ఓ మహిళా రాజ్ భవన్ ముందు బైఠాయించింది. సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోయినా వినకుండా గవర్నర్‌ను ఎలాగైనా కలిసేలా అవకాశం కల్పించాలంటూ ప్రాధేయపడింది.

గవర్నర్‌ను కలువాలంటూ రాజ్ భవన్ ముందు బైఠాయించిన మహిళా..
X

దిశ, ఖైరతాబాద్ : గవర్నర్‌ను కలువాలంటూ ఓ మహిళా రాజ్ భవన్ ముందు బైఠాయించింది. సెక్యూరిటీ సిబ్బంది అనుమతించకపోయినా వినకుండా గవర్నర్‌ను ఎలాగైనా కలిసేలా అవకాశం కల్పించాలంటూ ప్రాధేయపడింది. గవర్నర్ సెక్యూరిటీ అధికారులు పంజాగుట్ట పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకొని ఆమెను స్టేషన్ కు తరలించారు. పోలీసుల విచారణలో ఆమె బొల్లారం రిసాలబజార్ కు చెందిన నాగమణిగా గుర్తించారు.

అయితే తనకు ముంబాయిలో ఇళ్లు ఉందని, అక్కడ రూ.40లక్షలు చోరీకి గురైందని, అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వాపోయింది. కనీసం బొల్లారంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన ఫిర్యాదును స్వీకరించడం లేదని, గవర్నర్ కైనా తన గోడు చెప్పుకుందామని ఇక్కడి వచ్చానని తెలిపారు. ముంబాయిలో ఎక్కడ ఉంటారని, ఏం చేస్తారని పోలీసులు అడిగిన ప్రశ్నకు ఆమె సరైన సమాదానం చెప్పడం లేదు. దీంతో ఆమెకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించే పనిలో పోలీసులు ఉన్నారు

Next Story