- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాంగ్ రూట్‌లో వచ్చి.. మహిళ వీరంగం! ట్రాఫిక్ పోలీస్ బట్టలు చింపి హల్ చల్!
ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా సిటీలో కొందరు వాహనాలు నడుపుతున్నారు. వారిని చూసి ట్రాఫిక్ పోలీసులు ఆపితే..

X
దిశ, డైనమిక్ బ్యూరో: ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా సిటీలో కొందరు వాహనాలు నడుపుతున్నారు. వారిని చూసి ట్రాఫిక్ పోలీసులు ఆపితే.. పోలీసులపైనే దురుసుగా వాహనాదారులు ప్రవర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నిన్న రాత్రి బంజారాహిల్స్‌లో ట్రాఫిక్ హోమ్ గార్డ్ పై మహిళ వీరంగం సృష్టించిందని నెటిజన్లు వీడియోలు పోస్ట్ చేశారు.
జాగ్వర్ కారులో ఆమె రాంగ్ రూట్లో రావడమే కాకుండా అడ్డుకున్న హోంగార్డుపై బూతులు తిడుతూ అతని బట్టలు చింపి హల్ చల్ చేసిందని పోస్ట్ పెట్టారు. దీంతో ఆమెపై కేసు నమోదు అయినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. చదువుకున్న లేడీ, కోట్ల రూపాయల విలువ చేసే కారులో తిరుగుతారు, భాష చాలా దారుణంగా ఉందని ఆమెను నెటిజన్లు విమర్శిస్తున్నారు.
Next Story






