Putta Madhu vs Sridhar babu: 'పండవెట్టి నాలుక కోసేస్తా'.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు మహిళ మాస్ వార్నింగ్

by Prasad Jukanti |

మంత్రి శ్రీధర్ బాబుపై పుట్టమధు వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి.

Putta Madhu vs Sridhar babu: పండవెట్టి నాలుక కోసేస్తా..  బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు మహిళ మాస్ వార్నింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో (Manthani Politics) నిప్పు ఉప్పులా ఉండే రాజకీయ శత్రువులు మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu), మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పుట్టమధు (Putta Madhu) మధ్య మరోసారి రాజకీయాలు భగ్గుమంటున్నారు. ఇటీవల మంత్రి శ్రీధర్ బాబుపై పుట్ట మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. మంత్రి శ్రీధర్ బాబును, ఆయన తండ్రి దుదిళ్ల శ్రీపాదరావును ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు నియోజకవర్గంలో సంచలనంగా తీవ్ర కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలపై శ్రీధర్ బాబు అనుచరులు, మద్దతుదారులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పుట్టమధుకు ఓ మహిళా కాంగ్రెస్ నాయకురాలు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి శ్రీధర్ బాబు గురించి, ఆయన తండ్రి దివంగత శ్రీపాదరావు గురించి మాట్లాడితే పండవెట్టినాలుక తెగకోస్తామని హెచ్చరించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

రెండు రోజుల క్రితం పుట్టమధు మాట్లాడుతూ శ్రీపాదరావుది (Sripada Rao) మొత్తం నీచ చరిత్ర, వ్యభిచార చరిత్రఅని అనవసరంగా నియోజకవర్గంలో ఈ చర్చను తెరపైకి వచ్చేలా చేసుకోవద్దని శ్రీధర్ బాబును ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన స్పీకర్ అయ్యేంత వరకు కూడా చినిగిపోయిన లాగు వేసుకుని ఆర్టీసీ బస్సులో తిరిగేవాడని బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే శ్రీపాదరావు విగ్రహాలన్నీ తొలగించి వాటి స్థానంలో బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేస్తామని ఎవరు అడ్డొస్తారాలో చూస్తానంటూ కాంట్రవర్సీ కామెంట్స్ చేశారు. రాజకీయంగా బద్ధ శత్రువులైన పుట్ట మధు, శ్రీధర్ బాబు మధ్య తాజా పరిణామాలు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో చూడాలి మరి.

Next Story