- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Khandeva Fair : జాతరలో 2.5 కిలోల నువ్వుల నూనె తాగిన మహిళ
ఆదివాసీలు..గిరిజన(Adivasis..Tribals)తెగల్లోని దైవరాధన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. ప్రకృతిని తమ జీవన శైలీలో భాగంగా చేసుకొని పూజించే ఆదివాసీలు, గిరిజనులు ఆచార నియమాలను పాటించడం..ఆరాధ్య దేవతలకు మొక్కులు చెల్లిండం ఎంత కఠినమైన పాటించక మానరు.

దిశ, వెబ్ డెస్క్ : ఆదివాసీలు..గిరిజన(Adivasis..Tribals)తెగల్లోని దైవరాధన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి. ప్రకృతిని తమ జీవన శైలీలో భాగంగా చేసుకొని పూజించే ఆదివాసీలు, గిరిజనులు ఆచార నియమాలను పాటించడం..ఆరాధ్య దేవతలకు మొక్కులు చెల్లిండం ఎంత కఠినమైన పాటించక మానరు. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్‌లో గిరిజనుల ఆరాధ్య దైవం ఖాందేవుని జాతర(Khandeva Fair)ను ఘనంగా నిర్వహిస్తున్నారు. జాతరలో ఏళ్లుగా వస్తోన్న ఆచారం(Ritual) ప్రకారం తొడసం వంశానికి చెందిన ఆడపడచు(Woman) జాతరలో రెండున్నర కిలోల(2.5 kg) నువ్వుల నూనె(Sesame Oil)ను తాగింది(Drinks). ప్రత్యేక పూజల అనంతరం నాగుబాయి చందు(Nagubai Chandu)అనే మహిళ నూనెను తాగి మొక్కును చెల్లించుకుంది.
జాతరలో మూడేళ్లకోసారి ఒకరు నూనె తాగి మొక్కు చెల్లించడం ఆనవాయితీగా వస్తుంది. అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ ఖాందేవుని జాతరకు తెలగుు రాష్ట్రాలతో పాటుగా మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు చెందిన గిరిజనులు పెద్ద ఎత్తున హాజరవుతారు. పుష్య మాసంలో నెలవంక కనిపించిన తరువాత తాము పండించిన నువ్వులను గానుగతో నూనె సేకరించి, ఖాందేవ్ మొక్కు కోసం ఒక్కొక్కరి ఇంటి నుంచి నువ్వుల నూనె తీసుకువస్తారు.
అలా సేకరించిన నువ్వుల నూనెను ముందుగా ఖాందేవ్, పులి, ఏనుగు, దేవుళ్లలకు చూపించి.. కటోడ పూజారి సమక్షంలో నైవైద్యం పెట్టి నూనె మొక్కును ప్రారంభిస్తారు. తొడసం వంశంలో పుట్టిన ఆడపడుచు పెళ్లైన తరువాత ఇంటి పేరు మారినా.. ఆమె పుట్టిన వంశ ఆడపడుచుగానే మొక్కును చెల్లిస్తుంది. ఈ ఏడాది మెస్రం నాగుబాయి 2.5 కిలోల నువ్వుల నూనె తాగి మెుక్కును చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కొవ్వలక్ష్మి, మహారాష్ట్ర ఎమ్మెల్యే తొడసం రాజు హాజరయ్యారు.






