- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమాయకురాలిపై హింస.. మంత్రాల పేరుతో పాశవికత
మంత్రాల పేరుతో ఓ మహిళ ను కొడుతున్న సంఘటన నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీ కేంద్రంలో ఓ మసీద్ దగ్గర దారుణం

X
దిశ, మద్దూరు: ప్రజల అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని.. నారాయణపేట జిల్లాలోని పలు మండలాలలో మంత్రాలు.. తంత్రాల పేరుతో కొందరు ఇబ్బందులు పెడుతున్న ఇటీవల కాలంలో వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. మద్దూరు మండలంలో ఓ వ్యక్తి గత కొన్నాళ్లుగా మంత్రాలు.. తంత్రాల పేరుతో ప్రజలను నమ్మించాడు. ఆయన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారాయి. చేతబడులు చేస్తామని.. అనారోగ్యంగా ఉన్నవారికి మీ ఆరోగ్యం బాగు చేస్తామని మాయమాటలు చెబుతూ వారి జేబులను గుల్ల చేస్తున్నారు. మరికొంతమంది బాబాలు.. తాంత్రికులు మానసికంగా, ఆరోగ్యం సరిగా లేని వారి నీ దయ్యం పట్టింది.. భూతం పట్టింది.. మేము బాగు చేస్తామని మాయమాటలు చెబుతూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇటువంటి వారి విషయములో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
Next Story






