హుస్సేన్ సాగర్ లో మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన హైడ్రా డీఆర్ఎఫ్ టీం

by Ramesh Goud |

హుస్సేన్ సాగర్ (Hussien sagar) లో దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నా (Suicide Attempt)నికి పాల్పడింది.

హుస్సేన్ సాగర్ లో మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన హైడ్రా డీఆర్ఎఫ్ టీం
X

దిశ, వెబ్ డెస్క్: హుస్సేన్ సాగర్ (Hussien sagar) లో దూకి ఓ యువతి ఆత్మహత్యాయత్నా (Suicide Attempt)నికి పాల్పడింది. సమయానికి స్పందించిన హైడ్రా డీఆర్ఎఫ్ టీం (Hydra DRF Team) ఆ యువతిని కాపాడింది. మంగళవారం హైదరాబాద్ నడి బొడ్డున్న ఉన్న హుస్సేన్ సాగర్ లో ఓ యువతి ఆత్మహత్య చేసుకునేందకు దూకింది. మహిళ దూకడం గమణించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల సమాచారంతో రంగంలోకి దిగిన హైడ్రా డీఆర్ఎఫ్ టీం తాళ్ల సాయంతో సురక్షితంగా ఆ యువతిని కాపాడారు. ఆ యువతిని కూకట్‌పల్లి (Kukatpally), రాజీవ్ గాంధీ కాలనీ (Rajeev Gandhi Colony)లో నివసిస్తున్న 36 ఏళ్ల మెర్రీ W/O శ్రీనివాస్ అనే మహిళగా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగా హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్యకు యత్నించిందని తెలుసుకున్నారు. తర్వాత ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనలో సమయానికి స్పందించి యువతి ప్రాణాలు రక్షించిన హైడ్రాపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Next Story