మందుబాబులకు షాక్.. ఆ రోజు వైన్ షాపులు బంద్

by velandi.Saikiran |   (  Updated:2025-04-10 09:52:30  IST  )

తెలంగాణ ( Telangana) మందుబాబులకు ఊహించని షాక్ తగిలింది. ఎల్లుండి మద్యం దుకాణాలు ( Liquor stores ) మూతపడనున్నాయి.

మందుబాబులకు షాక్.. ఆ రోజు వైన్ షాపులు బంద్
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ ( Telangana) మందుబాబులకు ఊహించని షాక్ తగిలింది. ఎల్లుండి మద్యం దుకాణాలు ( Liquor stores ) మూతపడనున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్, అలాగే సికింద్రాబాద్ (Secunderabad) జంట నగరాలలో... వైన్స్ షాపులు (wine shops ) బంద్ కానున్నాయి. ఈనెల 12వ తేదీ శనివారం.... హనుమాన్ జయంతి ( Hanuman Jayanthi ) ఉన్న నేపథ్యంలో... మద్యం దుకాణాలు మూసివేయాలని హైదరాబాద్ పోలీసులు ( Hyderabad police) ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ పోలీసుల ఆదేశాల ప్రకారం... ఈనెల 12వ తేదీ 6 గంటల నుంచి... మరుసటి రోజు అంటే 13వ తేదీ ఉదయం 6 మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. మద్యం దుకాణాలతో పాటు బార్లు, కల్లు కాంపౌండ్లు, కూడా మూసివేయాలని హైదరాబాద్ సీపీ స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. స్టార్ హోటల్లోని బార్లు (Bars), రిజిస్టర్డ్ క్లబ్బులకు (Registered club) మాత్రం మినహాయింపు ఉంటుందని హైదరాబాద్ సీపీ పేర్కొన్నారు.


ఇక తమ రూల్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. దొంగ చాటుగా మద్యం విక్రయాలు జరిపితే... లైసెన్స్ ( License) రద్దు చేస్తామని కూడా హెచ్చరించారు. హనుమాన్ జయంతి రోజున ( Hanuman Jayanthi )... మతపరమైన గొడవలు చోటు చేసుకుంటాయనే నేపథ్యంలో... ముందస్తు చర్యలలో భాగంగా మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.


Next Story