ఇవాళ‌ మ‌ద్యం దుకాణాలు, బార్లు, క‌ల్లు కాంపౌండ్లు బంద్‌..!

by velandi.Saikiran |   (  Updated:2025-11-13 23:59:24  IST  )

మందు బాబులకు బిగ్ అలర్ట్. ఇవాళ మద్యం దుకాణాలతో పాటు బార్లు, కల్లు కాంపౌండ్లు మూతపడనున్నాయి. అయితే ఇది తెలంగాణ

ఇవాళ‌ మ‌ద్యం దుకాణాలు, బార్లు, క‌ల్లు కాంపౌండ్లు బంద్‌..!
X

దిశ‌, వెబ్ డెస్క్‌: మందు బాబులకు బిగ్ అలర్ట్. ఇవాళ మద్యం దుకాణాలతో పాటు బార్లు, కల్లు కాంపౌండ్లు మూతపడనున్నాయి. అయితే ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు. కేవలం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మాత్రమే. ఇవాళ ఉదయం 8:00 సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో మద్యం దుకాణాలు, క‌ల్లు కాంపౌండ్లు , బార్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు మూతపడనున్నాయి. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అటు న‌వంబ‌ర్ 11న జూబ్లీహిల్స్ బై పోల్ ఎన్నిక జ‌రిగింది. ఇక ఇవాళ‌ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్ ప్రక్రియ ఉంటుంది.

దీంతో ఆ ప్రాంతంలో 144 సెక్షన్ కూడా అమలులోకి తీసుకువచ్చారు. ఇది ఇలా ఉండగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ తరుణంలోనే గులాబీ పార్టీ నుంచి మాగంటి సునీత, కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేశారు. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. అయితే ఓటింగ్ ముగిసిన తర్వాత సర్వేలన్నీ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఇచ్చాయి. దీనిపై ఇవాళ మధ్యాహ్నం 12:00 లోపు క్లారిటీ రానుంది.

Next Story