ప్రశ్నిస్తే ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా..? హరీష్ రావు సంచలన ట్వీట్

by Ramesh Goud |   (  Updated:2025-04-17 03:40:39  IST  )

ప్రశ్నిస్తే ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (Former Minister, BRS Leader Harish Rao) మండిపడ్డారు.

ప్రశ్నిస్తే ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా..? హరీష్ రావు సంచలన ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రశ్నిస్తే ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (Former Minister, BRS Leader Harish Rao) మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లా (Nizamabad District) భీంగల్ మండలం (Beengal Mandal)లోని ఆర్మూర్ (Armoor)లో మంత్రి జూపల్లి కృష్ణరావు (Minister Jupally Krishna Rao) కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జరిగిన ఘర్షణపై ట్విట్టర్ వేదికగా స్పందించిన హరీష్ రావు.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి (BRS MLA Vemula Prashanth Reddy) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధర్నాకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు.

దీనిపై ఆయన.. కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇస్తానన్న తులం బంగారం ఏమైంది అని భీంగల్ కార్యక్రమంలో మంత్రి జూపల్లి ని ప్రశ్నిస్తే ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అలాగే స్థానికులు, బీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ అనుచరులు, పోలీసుల దాడిని తీవ్రంగా ఖండించారు. అంతేగాక ఇందుకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ డీజీపీ (Telangana DGP), నిజామాబాద్ సీపీ (Nizamabad CP) ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.

Next Story